హైదరాబాద్ కు అరుదైన గౌరవం

హైదరాబాద్  కు మరో అరుదైన గౌరవం దక్కినది . ప్రపంచ స్మార్ట్ సిటీల(ఆకర్షిణియ  నగరాల) జాబితా లో స్థానం దక్కిన్చుకున్నా భరత్ లోని మూడు ప్రధాన  నగరాలలో  హైదరాబాద్ అగ్రస్థానం లో నిలిచింది . ఆ తర్వాత ఢిల్లీ ,ముంబై లు  నిలిచాయి . స్విట్జర్లాండ్ కు చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ మేనేజ్ మెంట్ అండ్ డెవలప్మెంట్ , సింగపూర్ యూనివర్సిటీ అఫ్ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ సంయుక్తంగా ప్రపంచం లోని కొన్ని ఆకర్షణీయ నగరాలను ఎంపిక చేసుకొని అక్కడ పౌరులకు లభించే సేవలను మదించి ర్యాంకులు కేటాయించాయి . 


ప్రపంచం లో 102 ఆకర్షిణియ నగరాలకు ర్యాంకులు ఇచ్చాయి . మొత్తం 102 నగరాలలో  హైదరాబాద్ కు 67వ ర్యాంకు (ప్రపంచ ర్యాంకు ) తర్వాత ఢిల్లీ కి 68 , ముంబై కి 78 స్థానాలు దక్కిని .