విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు


 2 రోజుల విశాఖ జిల్లా పర్యటన నిమిత్తం తెదేపా అధినేత చంద్రబాబు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరోవైపు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు కార్యకర్తలు చేపట్టిన ద్విచక్రవాహన ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. విమానాశ్రయం వైపునకు వెళ్తున్న కార్యకర్తలను ఎన్ఏడీ కూడలి వద్ద అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఎమ్మెల్యేలు వాసుపల్లి, వెలగపూడి నిరసన తెలిపారు. మరికొందరు కార్యకర్తలను విమానాశ్రయంలోనూ పోలీసులు నిలిపివేశారు.