స్పేస్ లో నడిచిన అయినా ఇక లేరు


 అంతరిక్షంలో తొలిసారి నడిచిన వ్యక్తిగా చరిత్ర సృష్టించిన అలెక్సీ లియోనోవ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న 85ఏళ్ల లియోనోవ్ ఈరోజు తుదిశ్వాస విడిచారు. సోవియట్ ఎయిర్ ఫోర్స్ లో ఫైలట్ గా విధులు నిర్వర్తించిన లియోనోవ్.. అనంతరం వ్యోమగామిగా శిక్షణ తీసుకున్నారు. 54ఏళ్ల క్రితం 1965లో అంతరిక్షంలోకి వెళ్లిన లియోనోవ్.. అక్కడ దాదాపు 12 నిమిషాలపాటు నడిచారు. దీంతో అంతరిక్షంలో నడిచిన మొదటివ్యక్తిగా ఆయన గుర్తింపు పొందారు.