రెండు గంటల్లోపే మారథాన్


 కెన్యా అథ్లెట్ ఎలియుడ్ కి వోగ్ చరిత్ర సృష్టించాడు. రెండు గంటల్లోపే మారథాన్ (41.195 కిలోమీటర్లు)ను పూర్తిచేసి ఆ ఘనత సాధించిన తొలి అథ్లెట్ గా నిలిచాడు. శనివారం అక్కడి  ప్రేటర్ పార్క్ లో ప్రత్యేక సౌకర్యాల మధ్య నిర్వహించిన మారథాన్‌ను అతను గంటా 59 నిమిషాల 40.2 సెకన్లలో పూర్తి చేశాడు. ఇది అధికారిక రేసు కాదు కాబట్టి ఈ రికార్డును పరిగణించే అవకాశం లేదు. అయినప్పటికీ కొన్నేళ్లుగా అసాధ్యంగా భావించిన ఈ ఘనతను అందుకున్న కి వోగ్ చరిత్రలో నిలిచిపోతాడు.