వోలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్లు (వీవోసీ) క్యాన్సరు దారితీస్తాయి. జననావయవాన్ని సౌందర్య ద్రవాలతో కడగడం, కాస్మొటిక్ పౌడర్లు అద్దడం వంటి అలవాటున్నవారి రక్తంలో... ఈ వీవోసీ స్థాయులు అధికంగా ఉంటున్నట్టు రూఢి అయింది. యువతులు, మహిళలు సాధారణంగా టాంపన్లు, శానిటరీ న్యాప్కిన్లు, స్త్రీలు, వైప్స్ వంటి వాటిని వాడుతుంటారు. ఈ సాధనాల్లోని రసాయనాలు.. వారిలో నాడీ, శ్వాసకోశ, పునరుత్పత్తి వ్యవస్థలపై ప్రభావం చూపడమే కాకుండా, క్యాన్సర్లకూ కారణమవుతున్నట్టు ఈ పరిశోధనలో వెల్లడైంది.