మధ్యాహ్న భోజన సమయంలో పాఠశాల పిల్లలకు వారి వయసులకు అనుగుణంగా ఉండే పాటలను వినిపించాల్సిందిగా 'నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చి అండ్ ట్రెయినింగ్' (ఎన్‌సీఈఆర్టీ) పాఠశాలలకు సూచించింది. మధ్యాహ్నం భోజనం చేసే సమయంలో పాఠశాలల్లో ఇలా సంగీతాన్ని వినిపించడం ద్వారా ఆనందదాయక, సానుకూల వాతావరణం నెలకొంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.ఇలా చేయడం వల్ల పిల్లలు సంతోషం తో ఒక ముద్ద ఎక్కువే తింటారు .