హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కనకదుర్గ ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. అమీర్‌పేట్ లోని కనకదుర్గ అమ్మవారి గుడిలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గవర్నర్తో సహా వందలకొద్ది భక్తులు గుళ్లో పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరయి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ప్రజలంతా దసరా పర్వదినాన సంతోషంగా జరుపుకోవాలని కోరారు.