నేడు మరోసారి మోడీ, జిన్‌పింగ్ భేటీ


 చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇవాళ 2 రోజు భారత్ లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా మహాబలిపురం వేదికగా ఇవాళ మరోసారి ప్రధాని నరేంద్ర మోడీ, జిన్ పింగ్ భేటీ కానున్నారు. ఇద్దరు నేతల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. అంతర్జాతీయ అంశాలపై, ప్రాంతీయ సహకారం వంటి అంశాలపై, ఆర్టికల్ 370 రద్దు, కాశ్మీర్ అంశంపై మోడీ వివరించనున్నారు. సరిహద్దు సమస్యపైనా చర్చించే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటలకు జిన్‌పింగ్ భారత్ పర్యటన ముగించుకుని తిరిగి చైనాకు వెళ్లనున్నారు.