19 వేల కోట్ల అమ్మకాలు జరిపిన Flipkart, Amazon ఫ్లిప్ కార్ట్- బిగ్ బిలియన్ డేస్, అమెజాన్- గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఆఫర్లు సెప్టెంబర్ 29 నుంచి ఈ నెల 4వరకు కొనసాగాయి. ఈ ఆరు రోజుల మొత్తం మార్కెట్ విలువలో 90 శాతంతో రూ.19,000 కోట్ల అమ్మకాలు ఈ రెండు సంస్థలు చేపట్టినట్లు బెంగళూరుకు చెందిన పరిశోధన సంస్థ రెడ్ సీన్ కన్సల్టెన్సీ ప్రకటించింది. ఈ సీజన్లో 60-62% వాటాతో ఫ్లిప్ కార్ట్ టాప్ లో నిలవగా, Amazon 22 % వాటితో రెండవ స్థానంలో నిలిచింది.