శిలీంధ్రాలతో మొక్కల ఎదుగుదల.


 చాలారకాల మొక్కలు తమ పెరుగుదలకు స్నేహపూర్వకమైన శిలీంధ్రాల (ఫంగస్)పైనే ఆధారపడతాయని అమెరికా శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. కిరణజన్య సంయోగక్రియతో పాటు అలా అందే శక్తిలో 30% వరకూ ఫంగస్ ద్వారా సమకూరడం కూడా కొన్ని మొక్కలకు చాలా అవసరం. వీటివల్ల చెట్లు, మొక్కల ఆకులు, కాండం చాలా ఆరోగ్యంగా ఎదుగుతాయి" అని పరిశోధనకులు తెలిపారు.