'సోలో బ్రతుకే సో బెటర్' అంటున్న సాయిధరమ్ తేజ్


'సోలో బ్రతుకే సో బెటర్' అని అంటున్నారు టాలీవుడ్ యువ కథానాయకుడు సాయిధరమ్ తేజ్. ఆయన కథనాయకుడిగా సుబ్బు దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం 'సోలో బ్రతుకే సో బెటర్'. నభా నటేష్ కథానాయిక. బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్లో సోమవారం నిర్వహించారు. నవంబర్ నుంచి రెగ్యూలర్ గా షూటింగ్ జరగనున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఈ సినిమాకి సంబంధించిన టైటిట్ పోస్టర్‌ని చిత్రబృందం సోషల్ మీడియా వేదికగా ఈ రోజు విడుదల చేసింది.