భారతీయులకు ఉద్యోగాలపై నమ్మకం క్షీణించింది

 దేశ ప్రజలకు ఉద్యోగ కల్పనపై నమ్మకం రోజురోజుకూ తగ్గిపోతుంది. భారతీయ రిజర్వు బ్యాంకు(RBI) నిర్వహించిన ఓ సర్వేలో సంచలనాత్మకమైన విషయాలు వెల్లడయ్యా యి. సగానికి పైగా మంది తమకు ఉద్యోగ కల్పనపై ఎలాంటి ఆశలూ లేవని, ప్రభుత్వాలపై నమ్మకమూ లేనట్లు వెల్లడైంది. 'కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే' పేరుతో రిజర్వ్ బ్యాంక్ ఓ సర్వే చేపట్టింది. దేశంలో ఆర్థిక మందగమనం, స్తూల జాతీయ ఉత్పత్తి, మరికొన్ని అంశాలపై సర్వే నిర్వహించారు. కాగా, ఈ సర్వేలో ఉపాది కల్పనపై షాకింగ్ నిజాలు వెల్లడయ్యా యి. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 52.5 శాతం మంది తమకు ఉపాది పరిస్థితి దారుణంగా దిగజారిందని చెప్పారు.