నేడు అబ్దుల్ కలాం 88వ జయంతి మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె.అబ్దుల్ కలాం సాధారణ కుటుంబంలో పుట్టి ఇంటింటికీ తిరుగుతూ దిన పత్రికలు వేసిన కలాం.. భారత క్షిపణి సాంకేతికత పితామహుడిగా పేరు తెచ్చుకున్న వైనం, దేశ ప్రథమ పౌరుడిగా ఎదిగిన తీరు అనిర్వచనీయం! కఠోర పరిశ్రమతో తనను తాను మహోన్నతుడిగా చెక్కుకున్న శిల్పి..తన మాటలతో, చేతలతో కోట్ల మందిలో స్ఫూర్తి రగిల్చిన దార్శనికుడు..ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే తెలిసిన మహర్షి..పరాజయాలకు వెరవని ధీశాలి అయిన అబ్దుల్ కలాం 88వ జయంతి నేడు.