రామమందిర నిర్మాణానికి ప్రత్యేక చట్టం చేయాలి


 అయోధ్యలో రామమందిరం నిర్మాణం జరిగేంతవరకు పోరాడతామని పునరుద్ఘాటించారు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే. ముంబయిలో జరిగిన శివసేన వార్షిక దసరా ర్యాలీలో పాల్గొన్న రాక్రే... రామమందిర నిర్మాణానికి ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. మరాఠా ప్రజలకు తప్ప మరెవరి ముందు శివసేన తలవంచదని స్పష్టం చేశారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసమే BJP తో చేతులు కలిపినట్టు తెలిపారు.