కొబ్బరి పాలు ఎంతో మేలు


 కొబ్బరిపాలలో భాస్వరం, క్యాల్షియం వంటి పోషక పదార్థాలు ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. ఎముకల సమస్యలుంటే.. కొబ్బరి పాల వల్ల త్వరగా ఉపశమనం పొందవచ్చు. ఎముకలలో నొప్పి, వాపు తగ్గించడానికి సహకరిస్తాయి. కొబ్బరి పాలు కీళ్ల నొప్పులు తగ్గించడానికి మంచి ఔషధంలా పనిచేస్తాయి. కొబ్బరి పాలల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యల నుంచి బయటపడటానికి బాగా సహకరిస్తుంది. ఎలాంటి ఆహారమైనా.. త్వరగా జీర్ణమవడానికి ఇవి తోడ్పడతాయి.