రాజకీయ ప్రకటనలను తాము నిషేధించబోమని ఫేస్బుక్ CEO మార్క్ జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. రాజకీయ ప్రకటనలనేవి అభ్యర్థుల 'వాణి'ని వినిపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. "ఇలాంటి ప్రకటనలను వేయాలా? వద్దా అని గతంలో ఆలోచించాం. ప్రజాస్వామ్యం ఉన్న చోట రాజకీయ నాయకులను గానీ వార్తలనుగానీ సెన్సార్ చేసే హక్కు ప్రైవేటు కంపెనీలకు ఉందని నేననుకోను' అని జుకర్ బర్గ్ అని అన్నారు.
ఫేస్బుక్ రాజకీయ ప్రకటనలు నిషేధించదు