ఆ యాప్స్ ను తొలగించిన గూగుల్


 వార్షిక వడ్డీ రేటు 36 శాతం అంతకంటే ఎక్కువగా ఉన్న ప్రిడేటరీ లోన్ యాప్స్ ను గూగుల్ తొలగించింది. వీటిని వినియోగదారుల భద్రత రీత్యా తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది మొదట్లో తీసుకొచ్చిన ఎక్స్పోండెడ్ ఫైనాన్షియల్ పాలసీ కింద వీటిని తొలగించినట్లు గూగుల్ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే, ఈ చర్య చట్టబద్ధంగా నడుపుతున్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆన్లైన్ లెండర్స్ అలియన్స్ సీఈఓ మేరీ జాక్సన్ తెలిపారు.