ఎయిర్సెల్-మాక్సిస్ కేసులో కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరానికి ఢిల్లీ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో వారివురికి ముందస్తు బెయిల్ కల్పించడాన్ని సవాల్ చేస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై వివరణ ఇవ్వాలని తాజాగా కోర్టు ఇరువురికి ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ సురేశ్ దీనిపై శుక్రవారం విచారణ చేపట్టారు. తదుపరి విచారణను నవంబరు 29కి వాయిదా వేశారు.
మాజీ మంత్రి కి కోర్ట్ నోటీసులు