క్రికెట్‌కు తక్కువ... కుస్తీ పోటీలకు ఎక్కువ


 శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో ఘోర అపజయాన్ని మూటగట్టుకున్న పాకిస్తాన్ జట్టుపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఆమిర్ సోహైల్ పాక్ ఆటగాళ్ల తీరుపై విమర్శలు గుప్పించాడు. ' ఫిట్‌నెస్ పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామంటూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చెబుతోంది. అయితే క్రికెట్ కు తక్కువ... కుస్తీ పోటీలకు ఎక్కువ అన్నట్లు క్రికెటర్ల ఆకారం కనబడుతోంది. వీళ్లు ఒలంపిక్స్ లేదా Www కుస్తీ పోటీలకు సిద్ధం అవుతున్నారో అర్థం కావడం లేదు' అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.