కొండెక్కిన పువ్వుల ధరలు

 


సద్దుల బతుకమ్మ పండగ వేళ పూల ధరలకు రెక్కలొచ్చాయి. సాధారణ రోజుల్లో రూ.50కు కిలో విక్రయించే బంతిపూలను శనివారం వరంగల్ ప్రధాన తపాలా కార్యాలయం కూడలిలోని దుకాణాలలో కిలో రూ.600కు విక్రయించారు. బతుకమ్మకు అవసరమైన బంతి, చామంతి పూల కోసం బజారుకు వచ్చిన మహిళలు కొండెక్కిన ధరలు చూసి బెదిరిపోయారు.