మెరిసే చేతుల కోసం...


* ఒక చెంచా ఆలివ్ నూనె మరియు చక్కెర కలిపి చేతులకు రాసి మృదువుగా     మర్దన చేసి పది నిమిషాలు తరువాత చన్నీళ్ళతో కడిగెయ్యాలి.


* ఒక చెంచా దాల్చిన చెక్క పొడి మరియు తేనె కలిపి చేతులకు రుద్ది పది           నిమిషాల తరువాత కడిగెయ్యలి.


* రెండు చెంచాలు కీరదోస గుజ్జు మరియు నిమ్మ రసం కలిపి చేతులకు రాసి        పావు గంట తరువాత శుభ్రంగా కడగాలి.



* రెండు చెంచాలు నిమ్మ రసం, తేనె మరియు వంటసోడా కలపాలి. చేతులను   వేడి నీళ్ళతో కడుక్కుని, ఈ మిశ్రమాన్ని చేతులకు పట్టించి, పది నిమిషాలు     మర్దన చేసి గోరు వెచ్చని నీళ్ళతో కడిగేసుకోవాలి.