యోగాతో ఒనగూరే ప్రయోజనాలను గురించి తెలుసుకుందాం.
*క్రమం తప్పకుండ యోగా సాధన చేస్తే ఆక్సిజన్‌తో కూడిన రక్తము శరీరం అంతా బాగా ప్రసరిస్తుంది.
*గ్రంథులన్నీ సహజంగా, సరిపడ హార్మోన్సు విడుదల చేస్తాయి.
*యోగా సాధన వలన నాడీ వ్యవస్థతో పాటు శరీరమంతా చక్కని విశ్రాంతి పొందుతుంది. • *యోగాతో యవ్వనం పెరుగుతుంది. ముసలితనం వాయిదా పడుతుంది.
*యోగాతో కళ్ళ సమస్యలు, నిద్ర సమస్యలు తగ్గిపోతాయి.
*యోగాతో కొవ్వు నిల్వలు సమతుల్యంగా ఉంటాయి.
*యోగా సాధన వలన శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
*సైనస్, ఎలర్జీ సమస్యలు తగ్గిపోతాయి.
*తలనొప్పి, మైగ్రేన్ వంటివి తగ్గిపోతాయి.
*జీర్ణవ్యవస్థ సమస్యలు పరిష్కారమవుతాయి.
*మోకాళ్ళ నొప్పులు, మెడనొప్పులు, నడుము నొప్పులు తగ్గిపోతాయి.