ఫిట్నెస్ మంత్ర పార్ట్ -2


*యోగాతో మనస్సు ఆనందంగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది.


*యోగాతో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, గ్రహణశక్తి పెరుగుతాయి.


*యోగాతో ఆత్మవిశ్వాసం, స్వీయ క్రమశిక్షణ, భావోద్వేగ నియంత్రణ అలవడతాయి.


*యోగా సాధన వలన అనవసర ఆలోచనలు అదుపులోకి వస్తాయి.


*యోగా వలన సమస్యలు వచ్చినప్పుడు, పరిష్కరించుకొనే సామర్థ్యం, ధైర్యం పెరుగుతాయి.


*యోగాతో తోటి మనుషులతో సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి.


*యోగా సాధన వలన భావావేశం, దూకుడుతనం తగ్గి, నిదానం, సహనం అలవడతాయి.


*క్రమం తప్పకుండ యోగా సాధన చేస్తే ఒత్తిడిని ఎదుర్కోగల, వెంటనే తగ్గించుకోగల మెళకువలు అలవడుతాయి.