గోర్లలో దాచుకున్నతండ్రి అస్థికలు


లండన్‌కు చెందిన చార్లైట్ వాట్సన్ అనే యువతి నాలుగు నెలల క్రితం తన తండ్రి మిక్ బార్బర్‌ను కోల్పోయింది. తండ్రి మరణించడంతో ఆమె తీవ్రంగా కుంగిపోయింది. ఆయన జ్ఞాపకాలను కొంత కాలమైనా తనతోపాటు ఉంచుకోవాలని భావించింది. దీనికోసం తండ్రి అస్థికలను ఆమె గోర్లలో అమర్చింది. ఇందుకోసం చాగ్లైట్ కు గోర్లు పొడవుగా లేకపోయినా, కృత్రిమంగా అతికించి అస్థికలను అంటించింది. తర్వాత ఆ గోర్లను అందంగా తీర్చి దిద్దింది.