న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సమ్మె చేస్తున్న RTC కార్మికుల కోసం తాను జైలుకు వెళ్లేందుకు సిద్ధమని CLP నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నేడు భద్రాచలంలో RTC కార్మికుల సమ్మె శిబిరాన్ని సందర్శించి వారికి సంఘీభావం తెలిపారు. అనంతరం భట్టి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో సమ్మె కార్మికుల హక్కని అన్నారు. సమ్మె హక్కును కాలరాస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి KCR ఒక్క నోటి మాటతో 48,500 మంది కార్మికులను తొలగించినట్లు ప్రకటించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
జైలుకు వెళ్లడానికైనా సిద్ధం :భట్టి విక్రమార్క