రుగ్మత గుట్టువిప్పే కన్నీరు!


 నమూనాల ఆధారంగానూ రోగాలను గుర్తించవచ్చని ఆస్ట్రేలియా పరిశోధకులు తేల్చారు. టైప్-/ మధుమేహం ఉన్నవారిలో 'డయాబెటిక్ పెరిఫెరల్ న్యూరోపతి' రుగ్మతను గుర్తించడానికి కన్నీటి పరీక్ష ఉపయోగపడుతుందని సిడ్నీలోని న్యూసౌత్ వేల్స్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. ఈ సమస్య ఉన్నవారి కంట్లో 'సర్టైన్స్ పి' అనే ఒక ప్రొటీన్ స్థాయి తక్కువగా ఉంటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని ఆధారంగా ఈ సమస్యను వేగంగా, తొలిదశలోనే గుర్తించి, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చని వారు పేర్కొన్నారు.