ప్యారిస్: అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకొని ఏ దేశాన్నీ భయపెట్టే ఉద్దేశం భారత కు లేదని.. కేవలం రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యమని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని ఆయన నిన్న ఫ్రాన్స్ లో డసో ఏవియేషన్ సంస్థ నుంచి అత్యాధునిక యుద్ధ విమానం రఫేల్ ని స్వీకరించి ఆయుధపూజ నిర్వహించారు. అనంతరం రఫేల్ జెట్లో దాదాపు 25నిమిషాల పాటు చక్కర్లు కొట్టారు. జీవితంలో ఇలాంటి క్షణాలు ఒక్కసారే వస్తాయంటూ తన అనుభూతిని పంచుకున్నారు.
భయపెట్టడం భారత్ ఉద్దేశం కాదు