చైనా వ్యాఖ్యలను భారత్ పట్టించుకోదు


 జమ్మూకశ్మీర్ విభజనను తప్పుబట్టిన చైనాకు భారత్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. "భారత సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను ఇతర దేశాలు గౌరవిస్తాయని మేం భావిస్తున్నాం. భారత అంతర్గత వ్యవహారాల్లో చైనా సహా ఇతర దేశాల వ్యాఖ్యలను మేం ఆశించడం లేదు" అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీష్ కుమార్ పేర్కొన్నారు.