ప్లాస్టిక్ డబ్బాల్లోని ఆహారం తినడం వల్ల, సౌందర్య సాధనాలను వినియోగించడం వల్ల... వాటిలోని రసాయనాలు పుట్టబోయే బిడ్డల ప్రజాస్థాయిని ప్రభావితం చేస్తాయట. పుట్టబోయే శిశువుల నాడీ వ్యవస్థ అభివృద్ధిపై గర్భిణుల్లోని రసాయనాల ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై మౌంట్ సీనాయ్ లోని ఐకాన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ శాస్త్రవేత్తలు పరిశోధన సాగించారు. కీలకమైన గ్రంథులపై ప్రభావం చూపే హార్మోన్లకు చెందిన మొత్తం 26 రకాల రసాయనాల ఉనికిని వారు గుర్తించారు .