ఐరాసకి భారత్ తరఫున చెల్లించాల్సిన పూర్తి స్థాయి నిధుల్ని ఇప్పటికే అందజేశామని మన దేశ ఐరాస శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ వెల్లడించారు. మొత్తం 193 సభ్య దేశాల్లో కేవలం 34 మాత్రమే తమ వాటాను పూర్తిగా చెల్లించాయన్నారు. ఆయా దేశాలతో కూడిన జాబితాను ఆయన ట్విటర్‌లో పంచుకున్నారు. అయితే నిధులు చెల్లించని వారి పేర్లను ఐరాస అధికారికంగా ప్రకటించదు. కానీ, అధిక మొత్తంలో నిధులు బకాయి పడ్డ దేశాల్లో అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, మెక్సికో, ఇరాన్ ఉన్నట్లు సమాచారం.
--ఐరాసకు పూర్తి వాటా చెల్లించిన భారత్--