రాష్ట్రంలో చిన్నారులకు పోషకాహారం తగినంతగా అందడం లేదు. ఈ విషయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ అట్టడుగున (30వ స్థానం) ఉంది. రాష్ట్రంలో 6-23 నెలల వయసున్న చిన్నారుల్లో 1.3% మందే కనీస ఆమోదయోగ్యమైన ఆహారాన్ని పొందుతున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ చేపట్టిన 'సమగ్ర జాతీయ పోషకాహార సర్వే' (సీఎన్ఎస్ఎస్) నివేదిక వెల్లడించింది. ఈ విషయంలో జాతీయ సగటు 6.4%. సిక్కిం 35.9%తో ప్రథమస్థానంలో నిలవగా 32.6%, 20.6%లతో కేరళ, అరుణాచల్ ప్రదేశ్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
బక్కచిక్కిన బాల్యం