నటుడు రజనీకాంత్ మరోసారి హిమాలయాలకు వెళ్లారు. ఈయన తాను నటిస్తున్న చిత్రం షూటింగ్ పూర్తి అయిన ప్రతిసారి హిమాలయాలకు వెళ్లడం పరిపాటే. తాజాగా దర్బార్ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసిన రజనీకాంత్ ఆదివారం ఉదయం 6.40 గంటలకు చెన్నై విమానాశ్రయం నుంచి బయలుదేరి ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూనక్కు వెళ్లారు. అక్కడ నుంచి కేదార్నాథ్, బద్రీనాను సందర్శించి, అనంతరం హిమాలయాలకు వెళ్లి అక్కడ బాబాగుహలో ధ్యానం చేస్తారు. అలా అక్కడ 10 రోజులు గడిపి చెన్నైకి తిరిగివస్తారు....