థాయ్ లాండ్లో ఆరు ఏనుగుల మృతి


థాయ్ లాండ్లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆరు ఏనుగులు ఓ జాతీయ పార్క్ లోని జలపాతంపై నుంచి జారిపడి మృత్యువాతపడ్డాయి. మరో రెండు ఏనుగులను అటవీ అధికారులు రక్షించారు. ఈశాన్య థాయ్ లాండ్ ప్రాంతంలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో 'ఖోయోయాయి' జాతీయ పార్క్ లో ఏనుగుల ఆర్తనాదాలను గుర్తించి అధికారులు అక్కడికి చేరుకున్నారు. అధికారులు హ్యూ నారోక్ జలపాతం వద్ద పరిశీలించగా ఆరు ఏనుగులు నీటిలో మునిగి విగతజీవులుగా పడి ఉన్నాయి.