రైతుల ఆధార్ అనుసంధానానికి గడువు పెంపు


 ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద సాయం పొందడానికి రైతుల వివరాలు ఆధార్లో తప్పనిసరిగా అనుసంధానం కావాల్సి ఉండగా ఆ గడువును కేంద్రం నవంబర్ 30 వరకు పొడిగించింది. ఇంకా ఆధార్ అనుసంధానం కాని రైతులకూ రబీ సీజన్లో రూ.2వేలు అందిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద రైతులకు ప్రతి నాలుగు నెలలకు రూ. 2వేల చొప్పున మూడు విడతల్లో రూ.6వేలు అందిస్తోంది. 2018 డిసెంబర్-2019 మార్చి మధ్యలో తొలివిడత, 2019 ఏప్రిల్- జులై మధ్య రెండో విడత కింద ఇప్పటికే రూ.4,000 విడుదల చేసింది.