డైపర్లు మారుస్తూ ఎంజాయ్ చెయ్..!


 టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్యా రహానె శనివారం తండ్రి అయ్యాడు. అతని భార్య రాధిక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాగా రహానె సోమవారం తన జీవితభాగస్వామి రాధిక, కుమార్తెతో కలిసి దిగిన ఫొటోని ట్వీట్ చేశాడు. అది చూసిన క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్ రాధిక, రహానె మీ ఇద్దరికీ శుభాకాంక్షలు. తొలిసారి తల్లిదండ్రులయ్యారు. ఈ ఆనందంతో ఏదీ సరితూగదు. అందులో మునిగితేలండి. డైపర్లు మారుస్తూ నైట్ వాచ్మె న్‌గా కొత్త అవతారాన్ని ఎంజాయ్ చెయ్' అని పేర్కొన్నాడు.