ఇమ్రాన్ నిలిపేశాడా..ఎగదోశాడా?


పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని నిరసనకారులు ఆదివారం భారీయెత్తున నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ) వద్దకు దూసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎల్వీసీ దాటొద్దని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శనివారం వారిని హెచ్చరించారు. కశ్మీరీలకు మానవతా దృక్పథంతో సాయం చేసేందుకు ఎల్ వోసీని దాటితే భారత్ చెప్పే కథనాలకు బలం చేకూరుతుందని అన్నారు. ఆయన మాటలు నిరసనకారులను నిలువరించేలా కాకుండా ఎగదోసినట్టు కనిపిస్తోంది.