అమరావతి: రాష్ట్రంలోని ఎయిడెడ్ పాఠశాలల్లో పదోన్నతులకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఉన్న నిషేధిత ఉత్తర్వులను ఉపసంహరించినట్లు పేర్కొంది. దీని ప్రకారం అన్ని ఎయిడెడ్ విద్యా సంస్థల్లోని అర్హత కలిగిన సిబ్బంది నిబంధనల ప్రకారం పదోన్నతులు పొందుతారు.
ఎయిడెడ్ పాఠశాలల్లో పదోన్నతులకు అనుమతి