పన్ను సంస్కరణల్లో పెద్దదిగా చెప్పుకోదగిన ఇఅసెస్మెంట్ కు ఆదాయపు పన్ను (ఐటీ) విభాగం సోమవారం శ్రీకారం చుట్టింది. పన్ను చెల్లింపుదార్లు, పన్ను అధికారులు ఒకరినొకరు (ఫేస్-టు-ఫేస్) చూసుకునే అవసరం లేకుండా ఇ-అసెస్మెంట్ వ్యవస్థను రూపొందించారు. ఇందుకోసం చేపట్టిన ఇ అసెస్ మెంట్ జాతీయ కేంద్రాన్ని (ఎస్ఈఏసీ) రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే ప్రారంభించారు.