మేరీకోమ్ కు అరుదైన గౌరవం


 వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరుగనున్నఒలింపిక్స్ లో భాగంగా భారత మహిళా స్టార్ బాక్సర్, ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీకోమ్ కు అరుదైన గౌరవం దక్కింది. ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి 10 మంది అంబాసిడర్లలో మేరీకోమ్ కు చోటు దక్కింది. మహిళల అథ్లెట్ల విభాగంలో ఆసియా నుంచి మేరీకోమ్ అంబాసిడర్ గా నియమించబడ్డారు. ఇటీవల వరల్డ్ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన బాక్సర్‌గా రికార్డు సాధించిన మేరీకోమ్.. ఐదుసార్లు ఆసియా చాంపియన్‌షిపను గెలిచారు.