అక్కడ మళ్ళి భూకంపం....

 


 


జపాన్ లో భూమి మరోసారి కంపించింది. రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రత 5.7గా నమోదు అయినట్టు జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ తెలిపింది. జపాన్ లోని చిబాకెన్ ప్రాంతానికి 80 కిలో మీటర్ల దూరంలో భూమి కంపించినట్టు అధికారులు వెల్లడించారు. ఈ భూకంపం వల్ల సునామీ హెచ్చరిక ఏమీ లేనట్టు తెలిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.