ఆర్టీసీ సమ్మె: అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన జేఏసీ


 ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై చర్చంచేందుకు ఆర్టీసీ జేఏసీ బుధవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగే ఈ సమావేశంలో తమ భవిషత్తు కార్యచరణను ప్రకటించే అవకాశం ఉంది. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం అధ్యక్షతన జరిగే.. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించామని జేఏసీ తెలిపింది. సమ్మెని విరమించి విధుల్లో చేరాలని ఓ వైపు ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.