రాష్ట్రంలో చదువుతున్న డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యార్థులకు IT, ఎలక్ట్రానిక్ రంగాల్లో క్యాంపస్ ప్లేస్ మెంట్స్ కల్పించేందుకు రాష్ట్ర IT శాఖ కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తోంది. ఈ ఏడాది 20 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం ద్వారా కనీసం 3500 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకుంది. రాష్ట్రంలో ఉన్న 210 IT కంపెనీలు, 10 ఎలక్ట్రానిక్స్ కంపెనీలలో, టెక్నాలజీ పార్కుల్లో ఉన్న 75 కంపెనీల క్యాంపస్ ప్లేస్ మెంట్ లలో భాగస్వామ్యం కల్పించాలని AP IT శాఖ నిర్ణయించింది.
AP లో 3500 IT ఉద్యోగాలకు యాక్షన్ ప్లాన్