బద్దకంలో NO.1 మనమే

 


 


ప్రజల్లో చురుకుదనం అత్యంత తక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. నిద్రలేమి ఎక్కువగా ఉన్న దేశాల్లో రెండో స్థానంలో ఉంది. ప్రముఖ పిట్ నెస్ సంస్థ 'ఫిట్ బిట్' నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. చురుకైన దేశాల జాబితాలో హాంగ్ కాంగ్ మొదటి స్థానంలో ఉంది. నిద్రలేమితో బాధపడుతున్న దేశాల్లో జపాన్ మొదటి స్థానంలో ఉండగా... ఆ తర్వాతి స్థానంలో నిలిచింది భారత్. భారతీయులు రోజుకు సగటున 7 గంటల 1 నిమిషం మాత్రమే నిద్రపోతున్నట్లు ఫిట్ బిట్ నివేదిక పేర్కొంది.