కొత్తిమీర. ఈ ఆకులని కూరల్లో చివరిసారిగా ఫైనల్ టచ్ ఇవ్వాలని వేస్తుంటారు. దీన్ని వేయడం వల్ల ఒక్కసారిగా డిష్ టేస్ట్ మారిపోతుంది. గార్నిషింగ్‌గా కూడా దీన్ని వాడతారు. అయితే, కేవలం ఏదో వాసన, రుచి కోసమే ఈ ఆకుకూరను వాడటం కాదు.. దీన్ని వంటల్లో భాగం చేసుకోవడం వల్ల ఎన్నో అదనపు లాభాలున్నాయి.
* ప్రతిరోజూ ఉదయం పరగడపునే కొత్తిమీర జ్యూస్ తాగడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. పొట్ట నిండుగా ఉన్న భావన కలుగుతుంది. ఈ కారణంగా తక్కువ మోతదులో ఆహారం తీసుకుంటాం. ఈ కారణంగా బరువు తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
* శరీరంలోని విష, వ్యర్థ పదార్థాలను బయటికి పంపడంలో కొత్తిమీర బాగా పనిచేస్తుంది. కొత్తిమీర జ్యూస్‌ని తాగడంవల్ల శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ బయటికి వెళ్లిపోతుంది.
* యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలు కలిగిన కొత్తిమీర రసాన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల వైరల్ ఫీవర్స్, జలుబు వంటి సమస్యలు దూరమవుతాయి.