పల్లె ప్రగతి కోసం నిధులు విడుదల

 


 


పల్లె ప్రగతిలో భాగంగా గ్రామాభివృద్ధి, పారిశుధ్య నిర్వహణ, మొక్కల పెంపకానికి తెలంగాణ ప్రభుత్వం రూ.64 కోట్లను విడుదల చేసింది. పనుల నిర్వహణలో అత్యవ సరమైనచోట ఖర్చు పెట్టేందుకు 32 జిల్లాల కలెక్టర్ల (హైదరాబాద్ మినహా) రూ.2 కోట్ల చొప్పున అందుబాటులో ఉంచుతారు. ఈ మేరకు సమీక్షలో CM కేసీఆర్ ప్రకటించిన వెంటనే ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.