లండన్ కాలేజీ లో పర్యటించిన విద్యాబాలన్


 గణితశాస్త్ర మేధావిగా శకుంతలా దేవి గుర్తింపు తెచ్చుకున్నారు. 1980లో లండన్ వేదికగా ప్రపంచరికార్డు నెలకొల్పారు. తాజాగా ఆమె బయోపిక్ లో నటిస్తున్న విద్యాబాలన్ లండన్ ఇంపిరీయల్ కళాశాలను సందర్శించింది. ఆ కాలేజీలో పర్యటించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పింది. శకుంతలా దేవి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విద్యాబాలన్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా.. అనుమీనన్ దర్శకత్వం వహిస్తోంది. సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ప్రొడక్షన్స్ పతాకంపై విక్రమ్ మల్తోత్రా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.