పౌష్టికాహారలోపం కారణంగా చిన్నారులు అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. వారి , వయసుకు తగ్గట్టుగా ఎత్తు, బరువు ఉండటం లేదని జాతీయ కుటుంబ సర్వే కూడా ఇటీవల ప్రకటించింది. అందుకే దేశంలోని లక్షల అంగన్‌వాడీ కేంద్రాలకు ఖాళీ స్థలాలు ఉంటే వాటిని 'పోషణ్ వాటిక'లుగా మార్చి, అక్కడ పంటలు పండించి పౌష్టికాహార సమస్యను పరిష్కరించాలని కేంద్రం యోచిస్తోంది.