కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందం సభ్యులు సందర్శించారు. ప్రభుత్వ వైద్య సేవలో ఉచితంగా అందిస్తున్న మందులను స్వయంగా పరిశీలించారు. అధికరక్తపోటు నేటి పరిస్థితుల్లో ప్రాణాలను నిశబ్ధంగా హరిస్తోందని డబ్ల్యూహెచ్ వో ప్రతినిధి డాక్టర్ టామ్ ఫ్రీడెన్ అన్నారు. భారతదేశంలో ఎయిడ్స్, క్షయ, మలేరియా కన్నా రక్తపోటు మరణాలు అధికంగా జరుగుతున్నాయన్నారు.