ఉద్యోగులకు తాజాగా ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(EPFO) హెచ్చరికలు జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దని సూచించింది. ముఖ్యంగా ఈ మధ్య ఫోన్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించింది. PF ఖాతాకు సంబంధించిన UAN సంఖ్య సహా ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు ఖాతా సంఖ్య వివరాలను ఎవరితో పంచుకోవద్దని సూచించింది.