అంచనాలను అందుకోలేకపోయిన TCS


దేశీ IT సేవల దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు మార్కెట్ వర్గాల అంచనాలను అందుకోలేకపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కంపెనీ నికర లాభం /.8 శాతం వృద్ధి చెంది రూ. 8,042 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం రూ. 7,901 కోట్లు. ఇక జూలై-సెప్టె ::0బర్ త్రైమాసికంలో ఆదాయం 5.8% పెరిగి రూ. 36,854 కోట్ల నుంచి రూ. 38,977 కోట్లకు చేరింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయ వృద్ధి 8.4%గా నమోదైంది.